స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -593 లో.... దుగ్గిరాల ఇంటికి కనకం రాగానే రుద్రాణి, ధాన్యలక్ష్మి తనని అవమానిస్తారు. ఇక ఇందిరాదేవి ఇంట్లో పరిస్థితిని చెప్తూ బాధపడుతుంది. మరొకవైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తాడు. అక్కడకి కొంతమంది బ్యాంకు నుండి ఎంప్లాయిస్ వస్తారు. రాజ్ క్యాబిన్ లోకి వెళ్తారు. పర్మిషన్ లేకుండా వచ్చారేంటని రాజ్ అడుగగా.. రాజ్ అంటే మీరేనా అంటూ వాళ్లు వచ్చిన విషయం చెప్తారు.
మీ తాతయ్య తన ఫ్రెండ్ కంపెనీకి వంద కోట్లకి షూరిటి పెట్టారు. కానీ ఇప్పుడు ఆ కంపెనీ బోర్డు తిప్పింది. సీతారామయ్య ఫ్రెండ్ మనవడు మోసం చేశాడు. ఇప్పుడు అప్పు కట్టడం లేదు ఇక షూరిటీ ఉన్న మీ తాతయ్య గారు కట్టాలి ఆయన కోమలో ఉన్నారని తెలిసింది కాబట్టి ఇప్పుడు మీరే బాధ్యత వహించాలి. వంద కోట్లు కడతారా లేక ఆస్తులు జాప్తు చెయ్యమంటారా.. ఒక పది రోజులు టైమ్ ఇస్తామ్.. ఇందులో సంతకం చెయ్యండి అని వాళ్లు అనగానే రాజ్ సంతకం చేయబోతుంటే అక్కడ ఆఫీస్ లో ఎంప్లాయి రాజ్ ని పక్కకు పిలిచి సంతకం పెట్టకండి అని అంటాడు.
అంటే మా తాతయ్య మాటకి విలువ లేదా ఎవరు మా తాతయ్యని తప్పుగా అనుకోవద్దని రాజ్ తనపై కోప్పడతాడు. ఆ తర్వాత రాజ్ వాళ్ళు సంతకం పెట్టమన్న దగ్గర పెడతాడు. ఇక రాజ్ పది రోజుల్లో వంద కోట్లు ఎలా కట్టాలి? ఆస్తులు ఎలా కాపాడాలని ఆలోచిస్తూ నడుచుకుంటు వెళ్లిపోతాడు. తరువాయి భాగంలో రాజ్ సీతారామయ్య ఫ్రెండ్ మనవడు నందగోపాల్ దగ్గరికి వెళ్తాడు కానీ అతను లేడని ఫారెన్ కి వెళ్లాడని చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.